NTV Telugu Site icon

నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌

nursing students

తెలంగాణలో నర్సింగ్‌ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ నెలకు రూ. 1500లు ఉండగా రూ.5 వేలకు పెంచింది.

అంతేకాకుండా సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలకు పెంచగా, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి రూ.8 వేలకు పెంచింది.

వీరితో పాటు ఎమ్మెస్సీ నర్సింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.9 వేలకు, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.10 వేలకు స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.