Site icon NTV Telugu

సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంపున‌కు తెలంగాణ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్‌

Theatres

తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధర పెంపునకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల తో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం… ఏసీ థియేటర్లలో కనిష్ట టికెట్ ధర 50 రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 150 రూపాయలకు చేరనుంది.

https://ntvtelugu.com/sharmilas-sensational-comments-on-cm-kcr/

అలాగే మల్టీప్లెక్స్ లలో కనిష్ట టికెట్ ధర వంద రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 250 రూపాయలకు చేరనుంది. మల్టీప్లెక్స్ రిక్లయినర్ సీట్లకు గరిష్ఠంగా రూ.300 వసూలు చేయనున్నారు. టికెట్ల ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లలో… టికెట్ పై ఐదు రూపాయలు.. నాన్ ఏసీ థియేటర్ లలో టికెట్ పై మూడు రూపాయలు వసూలు చేయనున్నారు. ఆన్లైన్ లో విక్రయిస్తున్న టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version