ఎటూ తేల్చని కేంద్రం.. ఆందోళనలో రైతాంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వానాకాలం వరి ధాన్యాన్ని ఎంతకొంటామనే విషయంపై కేంద్రం ఎటూ తేల్చలేదు. యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని ఖరాఖండి గా తేల్చిచెప్పింది కేంద్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో న్యూ ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో విడి విడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా చర్చించారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం.
రాష్ట్రం నుంచి 3 మంత్రులు, రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలు సహా 10 మంది ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వ్యవసాయ. పౌరసరఫరాల శాఖ కార్యదర్శులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం చర్చల్లో పాల్గొంది. ఈ నెల 26 వ తేదీన సమావేశమౌతామని కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే సాగయిన వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని, రానున్న యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయం పై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం. రాష్ట్ర రైతాంగం ఎదుర్కుంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయం సంబంధిత అంశాలపై పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ఆధర్యంలోని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం మంగళవారం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు , కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.
Also Read
సీఎం కేపీఆర్ ఆదేశాలమేరకు మంత్రి కెటిఆర్ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పక్షనేత ఎంపీ కె.కేశవరావు, లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు.. సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, కొత్తా ప్రభాకర్ రెడ్డిలతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్ రావు లతో కూడిన ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చింది. తెలంగాణ వరిసాగు విస్తీర్ణం మీద కేంద్రం ఒక స్పష్టతకు వచ్చింది. 62 లక్షల 13 వేల ఎకరాల్లో తెలంగాణ రైతులు వరిధాన్యాన్ని సాగుచేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ వరి సాగు విస్తీర్ణాన్ని 58 లక్షల 66 వేల ఎకరాలుగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అయినా ఎంత వరిధాన్యాన్ని కొనే అంశాన్ని కేంద్రం పెండింగులో పెట్టింది. ఈనెల 26వ తేదీన మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మరోసారి సమావేశం కానున్నారు.
ప్రతి ఏటా ఎంత ధాన్యం కొంటామనే విషయంలో వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింపచేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభిప్రాయ పడింది. మంత్రి వర్గ బృందంతో చర్చల సందర్భంగా ఈ మేరకు సీఎం కేసిఆర్ సూచనను కేంద్రం అభినందించింది. ఇకనుంచి వార్షిక వరిధాన్యం కొనుగోలు వివరాలను ముందస్తుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్ఠం చేసింది.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!