Site icon NTV Telugu

మరో గ్రామంపై కేసీఆర్‌ ఫోకస్‌..? వారం పదిరోజుల్లో కాశిరెడ్డిపల్లికి..!

CM KCR 2

CM KCR 2

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సీఎం కేసీఆర్‌.. ఇవాళ ఆ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు.. సీఎం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు.. రేపటి నుంచి వాసాల‌మ‌ర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాం. రేప‌ట్నుంచే ద‌ళితుల చేతుల్లో రూ. 10 ల‌క్షల చొప్పున డ‌బ్బులు ఉంటాయ‌ని ప్రకటించారు.. ఇప్పుడు మరో గ్రామంపై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారా? అనే చర్చ సాగుతోంది.. అదే సిద్దిపేట జిల్లాలోని కాశిరెడ్డిపల్లి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వాసాలమర్రి పర్యటన ముగించుకుని తిరిగి ఫామ్ హౌజ్ కి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి గ్రామం వద్ద కాన్వాయ్‌ ఆపి గ్రామస్తులతో మాట్లాడారు సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కాశిరెడ్డిపల్లి సర్పంచ్ స్వరూప.. ఆమె భర్త మల్లేశం గ్రామ అభివృద్ధి కోసం సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. వారం పది రోజుల్లో నేను మీ గ్రామానికి వస్తానని, గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేసి వెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో.. కేసీఆర్‌ మరో గ్రామంపై ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది… గతంలో వాసాలమర్రిలో పర్యటించిన సీఎం.. అందరితో కలిసి భోజనం చేశారు.. ఇప్పుడు కాశిరెడ్డిపల్లికి కూడా వెళ్లనున్నారు అంటే.. ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందా? అనేది చూడాలి మరి.

Exit mobile version