NTV Telugu Site icon

కేసీఆర్‌ కీలక నిర్ణయం.. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

KCR

KCR

త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని చెప్పారు.. ఇక, ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవనాన్ని నిర్మిస్తామన్న సీఎం.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని గుర్తుచేసిన తెలంగాణ సీఎం.. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, పోడు భూముల సమస్య ఎప్పటి నుంచో గిరిజనులను ఇబ్బంది పెడుతోంది.. పోడు చేసుకోవడానికి వారు ప్రయత్నించడం… ఫారెస్ట్ అధికారులు, పోలీసులు అడ్డుకోవడం… వారిపై బాధితులు తిరగబడడం లాంటి ఘటనలు ఎన్నో జరుగుతోన్న సంగతి తెలిసిందే.