NTV Telugu Site icon

13వ ఎక్కాన్ని గుర్తుచేసిన భారత క్రికెటర్లు.. సోషల్ మీడియాలో ట్రోల్స్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో తొలి రోజు టీమిండియా మంచి స్కోరే చేసింది. అయితే టీమిండియా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. ఎందుకంటే వాళ్లు చేసిన పరుగులు 13వ ఎక్కాన్ని తలపిస్తుండటమే కారణం. మయాంక్ అగర్వాల్ 13 పరుగులు, శుభ్‌మన్ గిల్ 52 పరుగులు, పుజారా 26 పరుగులు చేశారు. దీంతో వీరి స్కోర్లు 13వ ఎక్కాన్ని గుర్తుచేస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: తొలి రోజు ముగిసిన ఆట… రాణించిన అయ్యర్, జడేజా

కాగా టెస్టుల్లో టీమిండియాకు బ్యాటింగ్‌లో గోడగా భావించే పుజారా సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో చివరిసారిగా పుజారా సెంచరీ చేశాడు. ఆ టెస్టులో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అతడు ఆడిన 22 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో పుజారాపై మంచి అంచనాలు నెలకొని ఉండగా.. అతడు నిరాశపరిచాడు. 26 పరుగులకే సౌధీ బౌలింగులో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.