Site icon NTV Telugu

వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఈసీని కలిసిన టీడీపీ ఎంపీలు

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సోమవారం సాయంత్రం లోక్‌సభ టీడీపీ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వైఎస్ఆర్‌సీపీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ వైసీపీ దాడులు చేయిస్తోందని, బూతులు తిట్టిస్తోందని ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

Read Also: ఏపీలో ఓటర్ల జాబితా విడుదల.. తూ.గో. జిల్లా ఫస్ట్

మరోవైపు 12 కేసుల్లో ఛార్జిషీట్లను ఎదుర్కొంటున్న జగన్‌ జైలుకు వెళ్లి బెయిల్‌పై బయట ఉన్నారని, ఆయనకు ఓ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదని ఈసీ దృష్టికి టీడీపీ ఎంపీలు తీసుకెళ్లారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని గట్టిగా కోరామని, తమ విజ్ఞప్తిని లోతుగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ తమకు హామీ ఇచ్చిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. కాగా ఇటీవల వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరగా.. ఇప్పుడు కౌంటర్‌గా టీడీపీ ఎంపీలు ఈసీని కలిసి వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.

Exit mobile version