Site icon NTV Telugu

గుడ్ న్యూస్‌: ఎల‌క్ట్రిక్ వాహ‌నం కొనుగోలు చేస్తే… ప‌న్ను మిన‌హాయింపు…

దేశంలో చ‌మురు ధ‌ర‌లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.  డీజిల్ పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో వాహ‌నదారులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.  వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారు.  ప్ర‌త్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు.  మామూలు వాహ‌నాల‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహ‌నాల ఖ‌రీదు అధికం.  ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనుగోలు చేసేవారిక ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత కార్ల‌ను క‌లిగి ఉండ‌టం ల‌గ్జ‌రీ అంశం కావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు వాటికి ఎలాంటి మిన‌హాయింపులు ఇవ్వ‌లేదు.  

Read: ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్ఐవీ ల‌క్ష‌ణాలు…?

అయితే, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌ను ప్రొత్సహించేందుకు కేంద్రం ప‌న్ను మిన‌హాయింపు చ‌ట్టంలో మార్పులు చేసింది.  సెక్ష‌న్ 80 ఈఈబీ కింద కారు రుణాలు తీసుకొని ఎలక్ట్రిక్ వాహ‌నాన్ని కొనుగోలు చేస్తే రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను రాయితీలు ల‌భిస్తాయి.  ఈ ప‌న్ను రాయితీ ఒక వ్య‌క్తికి ఒక‌సారి మాత్ర‌మే ల‌భిస్తుంది.  బ్యాంకుల నుంచి లేదా ఆర్థిక సంస్థ‌ల నుంచి రుణం తీసుకొని ఎల‌క్ట్రిక్ వాహ‌నం కొనుగోలు చేసిన వారికి ఈ రాయితీ ల‌భిస్తుంది.  కారు కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణం పై ప‌డే వ‌డ్డీలో రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రాయితీ ల‌భిస్తుంది.  ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 2023 మ‌ధ్య‌లో లోన్ తీసుకున్న వారికి ఈ రాయితీ ల‌భిస్తుంది.  

Exit mobile version