Tamota Price Effect : మెక్ డొనాల్డ్స్ దారిలోనే సబ్వే.. మెనూలో టమోటా అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టమోటా పేరు వినగానే సామాన్యులకు వణుకు పుడుతుంది.. రోజు రోజుకు ధరలు ఆకాశానికి నిచ్చెణలు వేస్తున్నారు.. టమోటా లేకుండానే కూరలు చేసుకొని తింటున్నారు.. సాదారణ ప్రజల గురించి పక్కన పెడితే ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ లు సైతం టమోటా కూరలను మెనూ నుంచి తీసేస్తున్నారు.. ఇక ప్రముఖ ఫుడ్ కంపెనీలు కూడా బ్యాన్ చేశాయి. ఇప్పటికే మెక్ డొనాల్డ్స్ టమాటా లేకుండానే తమ ఐటమ్స్ ఉంటాయని ప్రకటించింది. ఇదంతా తాత్కాలికమే అయినా.. టమాటా తినడం అంటేనే భారమవుతోంది. తాజాగా మెక్ డొనాల్డ్స్ దారిలోనే సబ్వే నడిచింది.. మెనూలోంచి టమోటా లను ఎత్తేసింది..
సబ్వే కూడా తమ ఔట్‌లెట్స్‌లో సలాడ్స్, శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసర కూరగాయలు, అందులోనూ టమాటా ధర ఏకంగా 400 శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పటి టమాట ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా.. కూడా ఇప్పటికీ టమాటా ధర రూ.200 పలుకుతుంది..
Also Read
టమాటా వినియోగాన్ని నిలిపివేసినట్లు న్యూఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, చెన్నైతో సహా పలు ప్రధాన నగరాల్లో కొన్ని సబ్వే ఔట్లెట్లలో డిస్ ప్లే బోర్డు పెట్టింది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌లోని సబ్వే స్టోర్ లో ‘టమాటాలు తాత్కాలిక అందుబాటులో లేవు’ అని కస్టమర్లకు బోర్డును ప్రదర్శించింది. ప్రస్తుతం వాటి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంత టమోటాలను సోర్స్ చేయలేకపోతున్నామని పేర్కొంది. టమాటా ధరలు చాలా రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్లను ప్రభావితం చేశాయి.. పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీలు కూడా టమోటాను తీసేస్తుండటం పై జనాలు చెవులుకొరుక్కుంటున్నారు.. ఇక టమోటా ధర తగ్గే సూచనలు లేవని వ్యాపారులు కూడా చెబుతున్నారు..
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!