ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆహారం లేక లక్షలాది మంది ప్రజలు అలమటిస్తున్నారు. మానవతా దృక్పధంలో కొన్ని దేశాలు ఆహారం వంటివి సరఫరా చేస్తున్నా, అవి కొంత వరకు మాత్రమే సరిపోతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏ ప్రపంచ దేశం కూడా అధికారికంగా గుర్తించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్టుగా తాలిబన్లు అక్కడి ప్రజలపై కఠినమైన చట్టాలు అమలు చేస్తూ మరిన్ని బాధలు పెడుతున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఫ్రీజ్ చేయడంతో నిధులు ఆగిపోయాయి.
Read: ఇది 24 క్యారెట్ల బంగారం కాదు…ఐస్ క్రీమ్…
దీంతో తాలిబన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో విదేశీ కరెన్సీని రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ సొంత కరెన్సీకంటే, అమెరికా డాలర్లను వినియోగించడం ఎక్కువైంది. చిన్న చిన్న వాటికి కూడా విదేశీ కరెన్సీని వినియోగిస్తూ వచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని అమెరికా ఫ్రీజ్ చేయడంతో దానికి కౌంటర్ అన్నట్టుగా విదేశీ కరెన్సీ వినియోగాన్ని రద్దు చేసింది. ఎవరైనా సరే దేశంలో విదేశీ కరెన్సీని వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో అక్కడ మరింత భయాందోళనలు మొదలయ్యాయి.
