Site icon NTV Telugu

Afghanistan: ఆఫ్గాన్‌లో ఈద్ వేడుకలు.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు

Taliban

Taliban

అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతంలో బాలికల చదువులపై నిషేధం విధించారు. మహిళలు జిమ్‌లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించడంపై కూడా నిషేధం విధించారు. తాజాగా ప్రపంవ్యాప్తంగా ఈద్ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. మహిళలపై తాలిబన్లు ఆంక్షలు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తఖర్, బగ్లాన్ ప్రావిన్స్‌లలో ఈద్ వేడుకలకు హాజరయ్యేందుకు గుంపులుగా మహిళలు బయటకు వెళ్లకుండా తాలిబన్లు నిషేధించారు. దేశంలో మహిళలపై ఆంక్షలు విధించేందుకు ఈ బృందం ఇలాంటి నిర్ణయాలను తీసుకుంది. తాలిబన్లు తమ పాలనలో మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూనే ఉంది. ఈద్ సందర్భంగా ఈద్ రోజు మహిళలు ప్రయాణించడానికి లేదా బయట నడవడానికి అనుమతించరాదని తాలిబాన్ ఆదేశించింది. పాలనా యంత్రాంగం జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని నాటిక్ మలిక్జాదా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.

ఈ నెల ప్రారంభంలో హెరాత్‌లోని వాయువ్య ప్రావిన్స్‌లో తోటలు, పచ్చని ప్రదేశాలు ఉన్న రెస్టారెంట్‌లలోకి కుటుంబాలు, మహిళలు ప్రవేశించడాన్ని తాలిబాన్ నిషేధించింది. ఔట్‌డోర్ డైనింగ్ నిషేధం హెరాత్‌లోని స్థాపనలకు మాత్రమే వర్తిస్తుంది, అలాంటి ప్రాంగణాలు పురుషులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మహిళలు హిజాబ్ (ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్) సరిగ్గా ధరించనందున నియంత్రణలు అమలులో ఉన్నాయి.
Also Read:KA Paul: స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత నా ఒక్కడికే ఉంది

కాగా, ఆగష్టు 2021లో, రెండు దశాబ్దాల యుద్ధాన్ని ముగించిన ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా నేతృత్వంలోని దళాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి బాలికలు, మహిళల స్వేచ్ఛపై నియంత్రణలను కఠినతరం చేసింది. ఈ చర్యలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఖండించాయి. ఆరవ తరగతి దాటిన బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఐక్యరాజ్యసమితితో సహా మహిళలు ఉద్యోగ అవకాశాలను చేపట్టడం కూడా నిషేధించబడింది.

Exit mobile version