తాలిబన్లు కలక ప్రకటన చేశారు. పంజ్‌షీర్‌ను కైవసం చేసుకున్నట్టుగా ప్రకటించారు. పంజ్‌షీర్ కైవసంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల కైవసం అయింది. ఇక అమ్రుల్లా సలేహ్ ఇంటిని తాలిబన్లు డ్రోన్లతో పేల్చివేశారు. పంజ్‌షీర్ రాజధానిలోని గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు తెలుపు జెండాను ఎగరవేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తాలిబన్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో తాలిబన్లు పూర్వమిత్రులైన అల్‌ఖైదా సహాయం తీసుకోవడంతో విజయం సాధించినట్టు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సంగతి తెలిసిందే.
Read: మరో దేశంలోనూ సైనిక తిరుగుబాటు… దేశాధ్యక్షుడు అరెస్ట్…
