మ‌రో దేశంలోనూ సైనిక తిరుగుబాటు… దేశాధ్యక్షుడు అరెస్ట్‌…

ఇప్ప‌టికే ఆఫ్ఘ‌నిస్తాన్ ను తాలిబ‌న్లు కైవ‌సం చేసుకోవ‌డంతో అక్క‌డ అంత‌ర్యుద్ధం జ‌రుగుతున్న‌ది.  ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆ దేశాధ్య‌క్షుడు దేశం వ‌దిలి పారిపోయాడు.  ఇక ఇదిలా ఉంటే, ఆఫ్రికాలోని గినియాలోనూ సైనికుల తిరుగుబాటు జ‌రిగింది.   దేశాన్ని సైనికులు వారి చేతిల్లోకి తీసుకున్నారు.  గినియా అధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు.  రాజ్యాంగాన్ని ర‌ద్దు చేసిన‌ట్టు సైనికులు ప్ర‌క‌టించారు.  దేశంలో ప్ర‌జారంజ‌క‌మైన పాల‌న సాగిస్తామ‌ని ఆ దేశ ఆర్మీ క‌ల్న‌ల్ మామాడి డౌంబౌయా తెలిపారు.  ఈరోజు కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు.  గినియాలో అధ్య‌క్షుడిని అదుపులోకి తీసుకొని సైనికులు పాల‌నను హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డాన్ని అమెరికా త‌ప్పుప‌ట్టింది.  ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్న‌ది.  

Read: ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

Related Articles

Latest Articles

-Advertisement-