Site icon NTV Telugu

ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల హస్త గతం.. కాబూల్‌లోకి ఎంట్రీ..

అనుకున్నతం పని అయిపోయింది.. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లోని 19 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఇక. ఆఫ్ఘన్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేదశగా కదులుతున్నారు.. దీనిలో భాగంగా తాలిబ‌న్ తిరుగుబాటుదారులు రాజ‌ధాని కాబూల్‌లోకి ప్రవేశించిరాని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకటించింది..

దేశంలోని అన్ని ప్రధాన న‌గ‌రాల‌ను ఇప్పటికే ఆక్రమించారు తాలిబన్లు.. ఇప్పుడు రాజ‌ధాని న‌గ‌రాన్నీ త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లో అడుగుపెట్టారు తాలిబన్లు.. కేపిటల్‌ సిటీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ ఉద‌య‌ం మ‌రో ప్రధాన న‌గ‌ర‌మైన జ‌లాలాబాద్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశానికి సంబంధించిన అన్ని సరిహద్దులను కూడా స్వాధీనంలోకి తీసుకున్నారు.. దీంతో అప్రమత్తం అయిన అమెరికా.. ఆఫ్ఘన్‌ నుంచి తమ రాయబారి కార్యాలయ సిబ్బందిని తరలిస్తోంది.. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని తరలిస్తోంది అమెరికా.. ఇదే సమయంలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ కూడా అమెరికాకు వెళ్లిపోయే ఆలోచనలు ఉన్నాడని ప్రచారం సాగుతోంది.

Exit mobile version