Site icon NTV Telugu

కాబూల్‌లో చిరువ్యాపారులపై తాలిబాన్ల ప్రభావం: అంతా బాగుంది కానీ…

పొట్ట చేత బ‌ట్టుకొని ల‌క్ష‌లాదిమంది ప్ర‌జ‌లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను వ‌దిలి వెళ్లిపోతున్నారు.  బ‌తికుంటే చాల‌ని అనుకుంటున్నారు.  తాము మారామ‌ని చెబుతున్నా ఆ మాట‌ల‌ను ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు.  ఇటీవ‌ల కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై  ఐసిస్ దాడుల త‌రువాత ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారిపోయాయి.  చిన్న చిన్నా వ్యాపారాలు చేసుకుంటూ జీవ‌నం సాగించే చిరువ్యాపారులు కాబూల్‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయ‌ని, అయితే, భ‌యం కార‌ణంగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డంలేద‌ని, బోర్డ‌ర్లు తెరుచుకోక‌పోవ‌డం వ‌ల‌న దిగుమ‌తులు, ఎగుమ‌తులు త‌గ్గిపోయాయ‌ని చెబుతున్నారు.  కాబూల్‌లో ప‌ర్షియ‌న్ వాట‌ర్ మిల‌న్‌ను మంచి డిమాండ్ ఉంటుంది.  వాటిని వివిధ ప్రాంతాల నుంచి దిగుమ‌తి చేసుకుంటారు.  అయితే, ఇప్పుడు వాటికి మ‌రింత డిమాండ్ ఏర్ప‌డింది.  లోక‌ల్‌గా స్టాక్ త‌క్కువ‌గా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.  పైగా బ్యాంకులు ఇప్ప‌టి వ‌ర‌కు తెరుచుకోలేద‌ని, బ్యాంకుల నుంచే త‌మ లావాదేవీలు కొన‌సాగుతున్నాయ‌ని, బ్యాంకులు మ‌రికొన్ని రోజులు తెరుచుకోకుంటే మ‌రింత ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు చిరు వ్యాపారులు.  ఎప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తాయో చెప్ప‌లేని ప‌రిస్థితి అని, వీలైనంత త్వ‌ర‌గా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డాల‌ని కోరుకుంటున్న‌ట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. 

Read: ఏపీ క‌రోనా అప్డేట్‌: కొత్తగా ఎన్నం టే…

Exit mobile version