Site icon NTV Telugu

LIC Appoints: ఎల్‌ఐసీ ఎండీగా తబ్లేష్‌ పాండే

Lic

Lic

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (ఎండీ)గా తబ్లేష్‌ పాండేగా నియామకం అయ్యారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఎండీ బీసీ పట్నాయక్‌ స్థానంలో పాండే నియమకం జరిగింది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా టేబ్లేష్ పాండే ఉన్నారు. ఎల్‌ఐసీలో ప్రస్తుతం నలుగురు ఎండీలు ఉన్నారు.
Also Read:Himanta Biswa Sarma: వచ్చే 3 ఏళ్లలో పంజాబ్ జీడీపీని అస్సాం అధిగమిస్తుంది..

కాగా, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీహోల్డర్స్‌కి తీపి కబురు అందించింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించడానికి మరో ఛాన్స్ ఇస్తోంది. ఇందుకోసం స్పెషల్ రివైవల్ క్యాంపైన్ ప్రారంభించింది. మార్చి 24 వరకు ఈ క్యాంపైన్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. లబ్ధిదారుల పాలసీ ల్యాప్స్ అయితే ఈ క్యాంపైన్‌లో పునరుద్ధరించుకోవచ్చు. తిరిగి పాలసీని కొనసాగించవచ్చు. అయితే ఇందుకోసం పాలసీహోల్డర్స్ కొంత లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ల్యాప్స్ అయిన ఎల్ఐసీ పాలసీకి పాలసీహోల్డర్స్ చెల్లించాల్సిన ప్రీమియం లక్ష రూపాయలు లోపు ఉంటే లేట్ ఫీజులో 25 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ.2 వేల 500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Realme C33: అద్భుత ఫిచర్స్ తో రియల్‌మీ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే!

Exit mobile version