NTV Telugu Site icon

స‌రికొత్త మిషిన్‌… నొప్పిలేకుండా రెప్ప‌పాటులో..

పుట్టుక మ‌న‌చేతుల్లో లేదు… ఎలా ఎక్క‌డ ఎప్పుడు పుడ‌తామో తెలియ‌దు.  చావుసైతం మ‌న చేతుల్లో ఉండ‌దు.  నిండు నూరేళ్లు బ‌త‌కాల‌ని అంద‌రం అనుకుంటాం.  కానీ అంద‌రూ అలా బ‌తుకున్నారా అంటే అదీ లేదు.  కొంత‌మంది జీవితంలో విసిగిపోయి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటారు.  ఆత్మ‌హ‌త్య చ‌ట్ట‌రిత్యా నేరం.  అయిన‌ప్ప‌టికీ బ‌ల‌వన్మ‌ర‌ణాలు జ‌రుగుతూనే ఉన్నాయి.  గ‌తంలో నాజీలు శ‌తృవుల‌ను గ్యాస్ ఛాంబ‌ర్స్ లో బంధించి చంపేసేవారు.  అయితే, కొన్ని దేశాల్లో సూసైడ్ అనేది చ‌ట్ట‌రిత్యా నేరం కాదు.  కారుణ్య‌మ‌ర‌ణాల‌కు చాలా దేశాల్లో చ‌ట్ట‌బ‌ద్ద‌త ఉంది.  అలాంటి దేశాల్లో స్విట్జ‌ర్లాండ్ కూడా ఒక‌టి.  

Read: ఆ ఖ‌డ్గం ఖ‌రీదు రూ. 21 కోట్లు…

స్విట్జర్లాండ్ దేశంలో కారుణ్య‌మ‌ర‌ణాల‌కు చ‌ట్ట‌బద్ద‌త ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే, స్విస్ ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఓ ప్ర‌క‌ట‌న చేసింది.  స్విస్ ప్ర‌భుత్వం ఓ డెత్ క్యాప్సూల్‌ను త‌యారు చేసింది.  చ‌నిపోవాలి అనుకునేవారు ఆ క్యాప్సూల్‌లో ప‌డుకుంటే చాలు రెప్ప‌పాటు వ్య‌వ‌ధిలో స్పృహ కోల్పోయి మ‌ర‌ణిస్తారు.  నొప్పి తెలియ‌కుండా మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌ట‌. చనిపోవాలి అనుకునే వ్య‌క్తి ఈ క్యాప్సూల్‌లో ప‌డుకున్నాక కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతుంద‌ట‌.  ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌రువాత యాక్టీవ్ బ‌ట‌న్ నొక్కితే చాలు వెంట‌నే నైట్రోజ‌న్ గ్యాస్ విడుద‌ల అవుతుంది.  కేవలం 30 సెకన్ల‌లోనే శ‌రీరంలో ఆక్సీజ‌న్ శాతం 1 శాతానికి ప‌డిపోతుంది.  ఆ వెంట‌నే వ్య‌క్తి చ‌నిపోతాడు.  నొప్పి తెలియ‌కుండా చంపేసే ఈ క్యాప్సూల్ వ‌చ్చే ఏడాది స్విస్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తుంది.