Site icon NTV Telugu

న్యూఇయ‌ర్ స్పెష‌ల్‌: నిమిషానికి 9 వేల ఆర్డ‌ర్లు…

కొత్త సంవ‌త్స‌రం వేళ ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి.  స‌రికొత్త రికార్డుసు సృష్టించాయి.  దేశంలో ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు స‌రికొత్త రికార్డుల‌ను సొంతం చేసుకున్నాయి.  డిసెంబ‌ర్ 31 వ తేదీన స్విగ్గిలో ప్ర‌తి నిమిషానికి 9 వేల ఆర్డ‌ర్లు బుక్ చేయ‌గా, జొమాటోలో నిమిషానికి 8 వేల ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు పేర్కొన్న‌ది.  గ‌తేడాది డిసెంబ‌ర్ 31 వ స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డ‌ర్లు రాగా, ఆ రికార్డును స్విగ్గి ఈ ఏడాది బ‌ద్ద‌లు కొట్టింది.  అంతేకాదు, యాప్‌లో ఎక్కువ ఏ ఐటెమ్‌ను బుక్ చేసుకున్నార‌నేది కూడా స్విగ్గి బ‌య‌ట‌పెట్టింది.  స్విగ్గియాప్‌లో ఎక్కువ మంది ఆర్డ‌ర్ చేసిన ఐటెమ్ బిర్యానీనే అని స్విగ్గి తెలియ‌జేసింది.  బిర్యానీ నిమిషానికి 1229 ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు స్విగ్గి తెలియ‌జేసింది.  డిసెంబ‌ర్ 31 వ తేదీ రాత్రి మొత్తం 2 మిలియ‌న్ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు స్విగ్గి తెలియ‌జేసింది.  

Read: ఒమిక్రాన్‌కు ఉచిత ప‌రీక్ష‌… లింక్ క్లిక్‌ చేస్తే…

Exit mobile version