Ericsson: టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 8,500 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. ఆర్థికపరమైన కారణాల వల్ల ఖర్చును తగ్గించుకునేందు ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 2022 చివరి నాటికి మొత్తం 105,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఎరిక్‌సన్.. గత నెలలో 2022 ఏడాదికి సంబంధించి ఆదాయాలను లెక్కించగా.. ఆదాయం కాస్త తగ్గినట్లు గుర్తించింది. ప్రపంచ ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆపరేటర్‌లు తాజా 5జీ నెట్‌వర్క్‌లను రోలింగ్ చేయడంలో నెమ్మదిగా ఖర్చు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎరిక్‌సన్ కూడా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: Harry Brook: హ్యారీ బ్రూక్ వరల్డ్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్
స్వీడిష్ కంపెనీ 2022 చివరిలో ప్రకటించిన 860 మిలియన్ల డాలర్చు ఖర్చు ఆదా ప్రణాళికను వేగవంతం చేసింది. 2023 మొదటి భాగంలో చాలా వరకు ఉద్యోగాలను తొలగించనుంది. మిగిలినవి 2024లో అమలు చేయబడతాయి. ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని.. డెలివరీ, సరఫరా, రియల్ ఎస్టేట్, ఐటీపై కూడా పని చేస్తున్నామని సంస్థ ప్రతినిధి జెన్నీ హెడెలిన్ చెప్పారు. మొత్తం 8,500 ఉద్యోగాలను తొలగించవచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు. 1,400 ఉద్యోగాల కోతలు స్వీడన్‌లో ఉన్నాయని, ఇది ఈ వారం ప్రారంభంలోనే ప్రకటించబడిందని ఎరిక్సన్ తెలిపింది. 2022 నాటికి నికర లాభంలో 39 శాతం తగ్గిందని ఆ సంస్థ వెల్లడించింది.