ఇటీవల గుండెపోటు గురయిన మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ క్రమంగా కోలుకుంటోంది. గుండెపోటు రావడంతో వైద్యులు సుస్మితా సేన్‌కు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. 36 రోజు అనంతరం ఆమె.. రోజువారీ దినచర్యను తన స్వంత వేగంతో స్వీకరిస్తోంది. తాజాగా వర్క్ ఔట్ మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను సుస్మితా సేన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సుస్మిత, ఆమె కుమార్తె అలీశా, సుస్మిత మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ ఉన్నారు. వీరందరూ కొన్నిరకాల వ్యాయామాలు చేశారు.
ఈ వీడియో కింద..’సంకల్పం ఒక్కటే మార్గం. మరింత శిక్షణకు అనుమతి లభించింది. నా ప్రియమైన వాళ్లు తిరిగి నేను ఎక్సర్‌సైజ్ చేసేందుకు సాయం చేస్తున్నారు. అలీశాకు, రోహ్మన్ షాల్‌కు ముద్దులు. ఐ లవ్యూ గయ్స్..’ అంటూ సుస్మిత క్యాప్షన్ రాసింది. ఫిబ్రవరిలో సుస్మిత గుండెపోటుకు గురై యాంజియోప్లాస్టీ చేయించుకుంది. తన లైవ్ సెషన్‌లలో ఒకదానిలో, సుస్మిత యువ తరాన్ని క్రమం తప్పకుండా వారి హృదయాలను తనిఖీ చేయమని అభ్యర్థించింది. సుస్మిత తన పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఆమె “ఆర్య సీజన్ 3” సిరీస్ షూటింగ్ కోసం సిద్ధమవుతోంది.
కాగా, సుస్మిత వీడియోపై నెటిజన్లు భారీగా కామెంట్లు చేశారు. సుస్మిత మీరు స్ఫూర్తిదాయకం. ”మీరు సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. సుస్మితా మీలాంటి వ్యక్తులు మాకు కావాలి” అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
