దేశ్యాప్తంగా చర్చగా మారి.. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ స్కామ్‌పై విచారణను మరోసారి వాయిదా వేసింది సుప్రీంకోర్టు… గత విచారణ తర్వాత ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం.. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై కలిసి విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
పిటీషనర్లకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం ఉండాలి.. సమాంతరంగా సోషల్ మీడియాలో లో పెగాసస్ పై చర్చలు చేయవద్దు అని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.. పిటిషనర్లు ఏమి చెప్పదల్చుకున్నారో కోర్టులోనే చెప్పండి.. ఒకసారి కోర్టును ఆశ్రయుంచినప్పుడు, ఇక్కడే సరైన రీతిలో వాదనలు వినిపించండి అని సూచిచింది.. పిటిషనర్ల ప్రతులు అందాయని, అధ్యయనం చేస్తున్నానని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. శుక్రవారం విచారణ జరపలేమని స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని కోరారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్… దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామన్న భారత ప్రధాన న్యాయమూర్తి… విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
