NTV Telugu Site icon

వండ‌ర్‌: అమెరికాలోని ఈ గ్రామానికి టెక్నాల‌జీ గురించే తెలియ‌ద‌ట‌… అక్క‌డికి వెళ్లాలంటే…

అమెరికా అంటే అభివృద్ది చెందిన టెక్నాల‌జీ, భారీ క‌ట్ట‌డాలు, ప‌బ్ క‌ల్చ‌ర్‌, ఫాస్ట్ లైఫ్‌. అన్నింటికీ మించి అధిక‌మొత్తంలో శాల‌రీలు. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ అమెరికా వెళ్లి అక్క‌డ సెటిల్ కావాల‌ని అనుకుంటారు. అటువంటి అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో అభివృద్ధికి దూరంగా, టెక్నాల‌జీ లేకుండా, ఇంట‌ర్నెట్, సెల్ ఫోన్ సౌక‌ర్యాలు లేకుండా ఉన్న గ్రామం ఒక‌టి ఉన్న‌ది. ఆ గ్రామం పేరు సుపాయ్‌. ఈ గ్రామం గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయ‌ల్లో ఉన్న‌ది. ఈ గ్రామం అమెరికా భూమ‌ట్టానికి మూడు వేల అడుగుల లోతులో ఉంటుంది. అక్క‌డికి చేరుకోవాలి అంటే గుర్రాలు, గాడిద‌ల‌పైన వెళ్లాలి.

Read: వ్య‌వ‌సాయ‌రంగంలో పెను మార్పులు… స్పేస్‌రైస్‌తో అధిక దిగుబ‌డులు…

ప‌ర్యాట‌క ప‌రంగా గ్రాండ్ కాన్య‌న్ లోయ‌ల‌ను ప్ర‌తి ఏడాది 55 వేల మంది సంద‌ర్శిస్తుంటారు. అయితే, సుపాయ్ గ్రామంలోకి ప్ర‌వేశించాలి అంటే అక్క‌డి పెద్ద‌ల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. అనుమ‌తి తీసుకున్న త‌రువాత గ్రామంలోకి వ‌చ్చిన వారు తప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాలి. ఈ గ్రామంలో పోస్టాఫీసు, చ‌ర్చి, పాఠ‌శాల ఉన్న‌ప్ప‌టికీ క‌రెంట్‌, ఇంట‌ర్నెట్‌, మొబైల్ సౌక‌ర్యం అందుబాటులో లేక‌పోవ‌డం విచిత్రం. సుపాయ్ గ్రామంలో మొత్తం 208 నివ‌శిస్తున్నారు. వీరు ఇంగ్లీష్ కాకుండా హ‌వాసుపాయి భాష‌ను మాట్లాడ‌తారు. గ్రామంలో వెదురు బుట్ట‌లు త‌యారు చేసి వాటిని స‌మీపంలోని సిటీకి తీసుకెళ్లి అమ్ముకుంటారు. ఇప్ప‌టికీ ఇలానే ఆ గ్రామంలో జ‌రుగుతున్న‌ది.