NTV Telugu Site icon

బద్వేల్ లో బీజేపీ పుంజుకుంది.. మోడీ అభినందించారు

ఏపీలోని బద్వేలు ఉపఎన్నిక ఫలితాలపై ప్రధాని అభినందించారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ అన్నారు. 700 ఓట్లు రానిచోట 21 వేలకు పైగా ఓట్లు రావడంపై హర్షం వ్యక్తం చేశారన్నారు. ఏపీలో ఏదో జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం చమురు ధరలపై వచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తవం. ఆ ప్రకటన ఏపీ ప్రజలను మోసగించడమే అవుతుందన్నారు.

ప్రకటనలో తప్పుడు సమాచారం గురించి మా సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాం. ఏపీ ప్రభుత్వాన్ని సీఎం దివాళా దిశగా తీసుకెళ్తున్నారు. ఆయన ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నియంత్రించాలన్నారు సునీల్ దేవ్ ధర్. ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని, తగ్గించే వరకు ఏపీ లో బీజేపీ ఆందోళనలు కొనసాగుతాయన్నారు సునీల్ దేవ్ ధర్.