పారాలింపిక్స్ లో భారత్ కు వరుస పతకాలు వస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్క రోజే నాలుగు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈ రోజు కూడా పతకాల వేటను ప్రారంభించారు. పారా బ్యాడ్మింటన్ ఇండియా ప్లేయర్ సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. సెమిస్ లో అద్భుత ప్రదర్శన చేసి సుహాస్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్ లో దూకుడుగా వ్యవరించి మొదటి రౌండ్ ను సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాతి రెండు రౌండ్లలో కొంచెం తడబడటంతో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు కలిపి ఏకంగా మన క్రీడాకారులు.. 17 పతకాలు సాధించగా ఇప్పుడు దానికి సుహాస్ సిల్వర్ కూడా కలిసింది. అయితే ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 26 వ స్థానంలో కొనసాగుతుంది.
పారా బ్యాడ్మింటన్ లో సుహాస్ కు సిల్వర్…
