Site icon NTV Telugu

ప్ర‌ధానికి షాకిచ్చిన సూడాన్ సైన్యం… రాజ‌ధానిలో…

సూడాన్ అతలాకుత‌లం అవుతున్న‌ది.  అస‌లే పేద‌రికం.  మ‌రోవైపు కరోనా భ‌యం.  నిరుద్యోగంలో సూడాన్ ఇబ్బందులు ప‌డుతున్న‌ది.  అంత‌ర్యుద్ధాలు, రాజ‌కీయ అస్థిర‌త‌లు కార‌ణంగా ఆ దేశం అభివృద్ధి చెంద‌లేక‌పోతున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, సూడాన్ రాజ‌ధాని ఖార్టోమ్‌లో ప్ర‌ధాని అబ్దాల హ్యాండాక్ ను సైన్యం అరెస్ట్ చేసింది.  దీంతో రాజ‌ధానిలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది.  దేశంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌క ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  అయితే, విష‌యాల బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఉండేందుకు, దేశంలో పెద్ద ఎత్తున అల‌జ‌డులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఇంట‌ర్నెట్‌ను నిలిపివేశారు.  రాజ‌ధానిలో అంత‌ర్జాతీయ విమానాల‌ను రద్ధుచేశారు.  దీంతో సూడాన్ లో ఏం జ‌రుగుతుందో బ‌య‌ట‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ది సైన్యం.  

Read: రిక్షావాలాకు ఆదాయ‌ప‌న్నుశాఖ షాక్‌: రూ.3 కోట్లు ప‌న్ను చెల్లించాల‌ని నోటీసులు…

Exit mobile version