NTV Telugu Site icon

అనుకోకుండా జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే… టీగా మారిందా…

టీ అంటే ఇష్ట‌ప‌డని వ్య‌క్తులు ఉండ‌రు.  ఉద‌యం లేచిన వెంట‌నే టీ తాగే అల‌వాటు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది.  ఇప్పుడు టీ మ‌నిషి జీవితంలో ఒక భాగం అయింది.  టీని మ‌న‌దేశంలో అత్య‌థికంగా పండిస్తుంటారు.  అయితే, టీని ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో అత్య‌ధికంగా పండిస్తున్న‌ప్ప‌టికీ టీని మొద‌టిగా త‌యారు చేసింది మాత్రం చైనాలోనే.  క్రీస్తుపూర్వం 2737లో అప్ప‌టి చైనా చ‌క్ర‌వ‌ర్తి షెన్‌నంగ్ క‌నిపెట్టారు.  ఆయ‌న‌కు వేడినీరు తాగే అల‌వాటు ఉన్న‌ది.  అయితే, వేడినీటిని కాచే స‌మ‌యంలో తేయాకు ఒక‌టి అనేకోకుండా మ‌రిగే నీటిలో ప‌డిపోయింది.  అది గ‌మ‌నించ‌కుండా షెన్‌నంగ్ ఆ వేడినీటిని తీసుకున్నారు.  

Read: చైనాకు షాక్‌: తైవాన్‌కు యూరోపియ‌న్ దేశాల అండ‌…

రుచి బాగుండ‌టంతో తేయాకుతో వేడినీరు కాచుకొని తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు.  ఆ త‌రువాత నుంచి టీ ప్ర‌పంచ‌వ్యాప్తం అయింది.  ఇప్పుడు ఎన్నోర‌కాల టీలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి.  వాటిలో గ్రీన్ టీ ముఖ్య‌మైన‌ది.  ఏప్రెల్ మే నెల మ‌ధ్య‌లో కోసిన తేయాకు నుంచి గ్రీన్ టీ త‌యారు చేస్తారు.  ఈ నెల రోజుల కాలంలో కోసిన తేయాకులో త‌యారు చేసిన టీ ని బెస్ట్ టీగా నిపుణులు పేర్కొంటున్నారు.