NTV Telugu Site icon

Srisailam : శ్రీశైలం ప్రసాదంలో చికెన్ ముక్క.. అధికారుల తీరు పై భక్తుడి అసహనం..

Srisailam

Srisailam

శంభో శంకరా.. కాపాడవయ్య అంటూ భక్తులు శివ నామ స్మరణ చేస్తూ భక్తులు శివాలయాలకు వెళ్తుంటారు.. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో అపచారం జరిగింది.. విషయానికొస్తే.. శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు.. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగినట్లు కన్పించడంతో షాక్ అయ్యాడు.. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు తెలుసుకొని షాక్ అయ్యాడు..

ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావటం కలకలం రేపుతోంది.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్పల్లి కి చెందిన ఓ వ్యక్తి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం అక్కడకు వెళ్లాడు.. ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది.

అది చూసిన అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు.. పవిత్రమైన ప్రాంతంలో ఏంటి ఈ అపచారం.. అంటూ ఎముక ఫోటోను యాడ్ చేసి ఓ లేఖను కూడా రాసాడు.. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీష్ రెడ్డి స్వయంగా కంప్లయింట్ ఇవ్వటంతోపాటు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.. అతనికి చాలా భక్తులు కూడా మద్దతుగా నిలిచినట్లు సమాచారం.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..