Site icon NTV Telugu

SriRama Navami: తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

Navami

Navami

శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముడిని భక్తులు దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల శోభా యాత్రను నిర్వహిస్తున్నారు. ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడు లోకానికంతటికీ ఆదర్శనీయుడు. సీతారామ కల్యాణమహోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రిలో శ్రీరాముల వారి కల్యాణానికి సర్వం సిద్ధమైంది. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read:BAN Vs IRE: లిటన్‌ దాస్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డుకు బ్రేక్

ఒంటిమిట్టలోని కోదండరామాలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది

Exit mobile version