పలు ఫీట్లతో అలరించిన శ్రీను వైట్ల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 24న దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు)
కామెడీతో కబడ్డీ ఆడేస్తూ, యాక్షన్ తో జనాన్ని ఆకట్టుకుంటూ, సెంటిమెంట్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ పలు ఫీట్లు చేశారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంటే షడ్రుచోపేత భోజనంతో సమానం అనుకోవాల్సిందే! అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో శ్రీనువైట్ల తన చిత్రాలను తెరకెక్కించి అలరించేవారు. జయాపజయాలు దైవాధీనం అన్నట్టుగా ఆయన అనూహ్య విజయాలనూ చూశారు. కొన్ని పరాజయాలతోనూ పయనించారు. అయినా ఈ నాటికీ జనం శ్రీను వైట్ల సినిమా అంటే నవరసభరితంగా ఉంటుందని భావిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని ఆకట్టుకొనేందుకే అన్నట్టు శ్రీను వైట్ల కూడా తన ప్రయత్నం మానుకోకుండా సాగుతున్నారు.
కొందరు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన శ్రీను వైట్ల తొలుత రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అయితే అనుకోని కారణాల వల్ల అపరిచితుడు ప్రేక్షకులకు పరిచయం కాకుండానే పోయాడు. తరువాత రవితేజ హీరోగా నీకోసం చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా విడుదల కోసం పలు పాట్లు పడ్డారు. ఉషాకిరణ్ సంస్థ నీ కోసంను జనం ముందు నిలిపింది. దాంతో శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ ఏమిటో జనానికి తెలిసింది. తరువాత ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన ఆనందంతో భలేగా ఆకట్టుకున్నారు శ్రీను వైట్ల. రవితేజ వెంకీలో శ్రీను వైట్ల కామెడీతో జనం కడుపులు చెక్కలు చేశారు. యాక్షన్, థ్రిల్స్ తోనూ మురిపించారు. చిరంజీవితో శ్రీను వైట్ల తెరకెక్కించిన అందరివాడు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. శ్రీను పని అయిపోయిందని చాలామంది భావించారు. ఆ సమయంలో ఢీతో బాక్సాఫీస్ ను ఢీడిక్కిలాడివంచారు. ఆ తరువాత రెడీతో రామ్ కు మరపురాని విజయం అందించారు. దుబాయ్ శీను, నమో వెంకటేశ, కింగ్ చిత్రాలలో శ్రీను పూయించిన నవ్వులను ఇప్పటికీ జనం ఏరుకుంటూనే ఉన్నారు. మహేశ్ బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన తొలి చిత్రం దూకుడు బాక్సాఫీస్ వద్ద నిజంగానే దూకుడు చూపింది. ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల రేంజ్ మారిపోయింది. ఆ తరువాత శ్రీను దర్శకత్వంలో బాద్ షా, ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ రూపొందినా, మళ్ళీ దూకుడు నాటి మ్యాజిక్ సాగలేదు. మరో చిత్రంతో జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నంలో శ్రీను వైట్ల ఉన్నారు. ఆయన మునుముందు మరింతగా జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.
Also Read
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!