NTV Telugu Site icon

తెలుగు రాష్ట్రాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం… 

దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా మే 1 వ తేదీ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా దేశంలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి డిసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.  మే 1 వ తేదీన కొన్ని వ్యాక్సిన్లు రష్యా నుంచి ఇండియాకు దిగుమతి కాగా, నిన్నటి రోజున మరికొన్ని వ్యాక్సిన్లు దిగుమతి అయ్యాయి.  ఇక ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించారు.  ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఆపోలో ఆసుపత్రిలో ఈ డ్రైవ్ ను ప్రారంభించారు.  హైదరాబాద్ తో పాటుగా అటు వైజాగ్ లో పైగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.  మొదటి వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ కు చెందిన సిబ్బందికి అందించారు.  ట్రయల్ రన్ లో భాగంగా మొత్తం 50 వేలమందికి వ్యాక్సిన్ అందిస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది.