మనదేశం సంస్కృతి, సాంప్రదాయల కు పెట్టింది పేరు.. దైవ భక్తి కూడా ఎక్కువే అయితే.. ప్రతి వీధికి ఒక్క దేవాలయం ఉంటుంది.. గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చెయ్యడం చేస్తుంటారు.. ఆ సమయంలో మనం దేవుడి మీద నిమగ్నమై స్మరిస్తూ చేస్తాము.. గుడి వెనక చాలామంది నమస్కరిస్తారు.. అలా చెయ్యడానికి చాలా అర్థం ఉందని పండితులు అంటున్నారు.. అసలు ఆలయం వెనుక ఎందుకు మొక్కుతారో చాలా మందికి తెలియదు.. దీని వెనక చాలా పెద్ద చరిత్ర ఉందని నిపుణులు అంటున్నారు.. ఆ చరిత్ర ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం.. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆలయం వెనక భాగంలో మనపూర్వీకుల కాలం నుంచే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయం వెనక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు. అదే ఆచారాన్ని ఇప్పటికీ భక్తులు కొనసాగిస్తున్నారు. గుడి వెనక భాగంలో మొక్కితే వారికి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.. ఆది కాదని పండితులు చెబుతున్నారు.. మరి అసలు కారణం వేరే ఉందట.. అదేంటో ఇప్పుడు వివరంగా ఒక్కసారి తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా..
గర్భగుడి లోపల వెనుక వైపున ఉన్న గోడకి కాస్త దూరంలోనే ఓ పీఠాన్ని అమర్చి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అలా ప్రతిష్టించిన విగ్రహానికి ప్రతినిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్ని జరిపిస్తూ ఉంటారు.. అయితే కింద ఉన్న మంత్ర పీఠంలోకి శక్తి వస్తుందట.. ఆ శక్తి గర్భగుడి లోపల నలుమూలల వ్యాపిస్తుందని, ముఖ్యంగా మూలవిరనాట్టు వెనక భాగంలో ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.. అందుకే ఆ శిల్పంలోకి శక్తి వస్తుంది.. భక్తులు ఆ వెనక తాకి నమస్కరించడం వల్ల శక్తి వారికి వస్తుంది.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని అంటున్నారు.. అందుకే భక్తులు మూలవిరాట్టు ను దర్శించిన తరువాత ఆలయం వెనక భాగంలో చెక్కిన శిల్పాన్ని మొక్కుతారని పండితులు అంటున్నారు.. చూసారుగా ఎంత అద్భుతం జరుగుతుందో అందుకే ఇకమీదట గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా నమస్కరించడం మర్చిపోకండి..