NTV Telugu Site icon

అందుబాటులో లేని ఎమ్మెల్యే.. అడ్డూ అదుపూ లేని ఛోటా నేతల అక్రమాలు

మా ఎమ్మెల్యే కనపడుట లేదు… ఇది ఆ నియోజకవర్గ ప్రజల మాట. మొదటి సారి బంపర్‌ మెజారిటీతో గెలిచిన ఆయన, నియోజకవర్గంలో మరీ నల్లపూసై పోయారట. అనుచరుల్ని వాకబు చేస్తే సారు చాలా బిజీ అంటున్నారట.. ఎవరికీ దొరకని యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మరి?

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ …. యువ ఎమ్మెల్యే ..పలమనేరు నియోజకవర్గ చరిత్రలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. తొలిసారి టికెట్ దక్కించుకుని, గత ఎన్నికలో దాదాపు నలభైవేలకు పైగా మెజారిటీతో మాజీ మంత్రి అమరనాధరెడ్డిపై గెలిచారు. 2014లో వైసీపీ నుండి అమర్నాథ్‌ రెడ్డి గెలిచినా… తరువాత కాలంలో తిరిగి సొంత గూడైన టిడిపిలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న పార్టీలో విభేదాలు, అభివృద్ధి పెద్దగా జరగపోవడంతో గత ఎన్నికలలో ఆయనకు సీన్ రివర్స్ అయ్యింది. ఇదే సమయంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి అయినా, అత్యంత భారీ మెజారిటీతో వెంకటయ్య గౌడ్ ని గెలిపించారు నియోజకవర్గప్రజలు.

కానీ, ఎమ్మెల్యేకి రాజకీయ అనుభవం లేకపోవడంతో దీనినే అలుసుగా తీసుకుని పలమనేరులో ఛోటా మోటా నాయకులు రెచ్చిపోతున్నారని టాక్ ఓ రేంజ్ లో వినపడుతుంది. అది కాస్తా గత పంచాయతీ ఎన్నికల సమయంలో పీక్స్ కు చేరిందని స్ధానికులు చెబుతున్నారు …

ఎమ్మెల్యే నియోజక వర్గంలో కంటే సొంత వ్యాపారాల కోసం బెంగుళూరులో ఉంటున్నారట. దీంతో పార్టీలో ఎవరికి నచ్చివారు వ్యవహరిస్తున్నరనే మాటలు కేడర్ లో వినపడుతున్నాయి. మంత్రి అనుచరులు ఓ వర్గం గా.. ఎమ్మెల్యే అనుచరులు మరో వర్గంగా.. గతంలో టికెట్‌ ఆశించి భంగపడినా నేతలు మరో వర్గం ఉంటున్నారట. దీంతో కేడర్ సైతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారట…. ఏదైనా పనికోసం అయినా, సమస్యలు పరిష్కారానికి ఈ మూడు వర్గాల్లో ఎవరిని కలవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారటా లోకల్ వైకాపా కేడర్.

ఇక ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో ఛోటా నేతలు… బెదిరింపులు… భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారనే టాక్ స్ధానికుల్లొ వినపడుతోంది… ఇవన్నీ ఎమ్మెల్యేకి చెబుదామన్న ఆయన అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు స్ధానికులు…
వారి అనుచరులను అడిగితే సార్ వెరి బిజీ అంటున్నారట… కరోనా సమయంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని సమాచారం … మంత్రి పెద్దిరెడ్డి నియోజక వర్గానికి వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యే హడవిడి చేయడం తప్ప … సాధారణ సమయాల్లో ఆయన పెద్దగా కనపడటం లేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి… మాజీ మంత్రి అమరనాధరెడ్డిని పక్కన పెట్టి అవకాశం ఇస్తే.. ఆయన సొంత పనుల్లో ఆయన బిజీ ఉంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేశారని టాక్ జోరుగా నియోజకవర్గంలో సాగుతోంది …