శ్రీనగర్‌లో తొలిసారిగా ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26 వ తేదీన శ్రీనగర్‌లో ఎయిర్‌షోను నిర్వహించనున్నారు. ఫ్రీఢమ్ ఫెస్టివల్ పేరుతో ఈ ఎయిర్‌షోను నిర్వహించనున్నారు. ఈ ఎయిర్‌షోకు మిగ్ 21, సుఖోయ్ 30 విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదం కారణంగా నిత్యం తుపాకుల మొతతో దద్దరిల్లిపోయే శ్రీనగర్, దాల్ సరస్సులు ఇప్పుడు కొత్త తేజస్సును నింపుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశ్మీర్‌లోని యువతను ఎయిర్‌ఫోర్స్, విమానయానరంగం వైపు అడుగులు వేయించేందుకు ప్రభుత్వం ఈ ఫ్రీఢమ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జమ్మూకాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులు పాల్గొనబోతున్నారు.
Read: అవతార్ కార్: ఒకసారి రీచార్జ్ చేస్తే 700 కిమీ ప్రయాణం…
