అవ‌తార్ కార్‌: ఒక‌సారి రీచార్జ్ చేస్తే 700 కిమీ ప్ర‌యాణం…

విప‌ణిలోకి రోజుకోక కొత్త మోడ‌ల్ కారు వ‌స్తున్న‌ది.  హైఎండ్ టెక్నాల‌జీతో కార్ల‌ను త‌యారు చేస్తున్నారు.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ను కార్ల త‌యారీతో వినియోగిస్తున్నారు.  మ‌నం మ‌నసులో ఏమ‌నుకుంటామో ఆ విధంగా కారు మారిపోతుంది.  ఇంకా చెప్పాలి అంటే అవ‌తార్ సినిమాలో మ‌న‌సులో అనుకున్న విధంగా అక్క‌డి ప్ర‌కృతి మారిపోయిన విధంగా కారు కూడా మారిపోతుంది. ఏసీ కావాలి అనుకుంటే ఆన్ అవుతుంది.  మ్యూజిక్ వినాలి అనిపిస్తే మ్యూజిక్ ప్లేయ‌ర్ ఆన్ అవుతుంది.  ఇలా మ‌న మైండ్‌తోనే కారును కంట్రోల్ చేయ‌వ‌చ్చు.  ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సంస్థ విజ‌న్ అవ‌తార్ పేరిట కాన్సెప్ట్ కారును త‌యారు చేసింది.  ఈ కారును మ్యూనిక్ న‌గ‌రంలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఆటోమోబైల్ ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌ద‌ర్శిస్తోంది.  ఈ కారు బ్యాట‌రీని ఒకసారి రీచార్జ్ చేస్తే 700 కిమీ దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.   ఆ కారు బ్యాట‌రీని గ్రాఫిన్ టెక్నాల‌సీతో రూపొందించారు.  ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హానీ ఉండ‌ద‌ని మెర్సిడెజ్ బెంజ్ సంస్థ పేర్కొన్న‌ర‌ది.  

Read: మొద‌లైన తాలిబ‌న్ల అరాచ‌కం: కాబూల్‌లో భారత వ్యాపారి కిడ్నాప్‌…

Related Articles

Latest Articles

-Advertisement-