NTV Telugu Site icon

ఉద్యోగుల‌కు లేడీ బాస్ క‌ళ్లు చెదిరే ఆఫర్‌… ప్ర‌పంచంలో ఎక్క‌డికైనా వెళ్లేందుకు…

సాధార‌ణంగా కంపెనీ లాభాల బాట ప‌డితే అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ప్రైవేటు సంస్థ‌లు బోన‌స్‌లు ఇస్తుంటారు.  కంపెనీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ఉద్యోగుల‌కు వారి జీతాల‌ను అనుస‌రించి బోన‌స్‌లు ప్ర‌క‌టిస్తుంటారు.  అయితే అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ అనే లేడీ బాస్ త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులంద‌రికీ అద్భుత‌మైన క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.  ప్ర‌పంచంలో ఉద్యోగులు ఎక్క‌డికైనా వెళ్లి వ‌చ్చేందుకు రెండు ఫ‌స్ట్ క్లాస్ విమాన టికెట్లు,  ఖ‌ర్చుల కోసం రూ.7.5 ల‌క్ష‌ల రూపాయ‌లు అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  సారా బ్లేక్లీ స్పాన్‌క్స్ అనే కంపెనీని నిర్వ‌హిస్తున్నారు.  ఈ కంపెనీ ఎన్నో క‌ష్టాలను ఓర్చుకొని పోటీని త‌ట్టుకొని నిల‌బ‌డింది.  కాగా, ఈ కంపెనీ స్టోన్ బ్లాక్ అనే మ‌రో కంపెనీతో ఒప్పందం చేసుకుంది.  ఈ ఒప్పందం విలువ 1.2 బిలియ‌న్ డాల‌ర్లు.  ఈ ఒప్పందం చేసుకోవంతో ఆ ఆనందాన్ని త‌న ఉద్యోగుల‌తో క‌లిసి పంచుకోవాల‌ని అనుకున్నారు.  వెంట‌నే ఉద్యోగులంద‌రికీ ప్ర‌పంచంలో ఎక్క‌డికైనా వెళ్లి వ‌చ్చేందుకు రెండు ఫ‌స్ట్‌క్లాస్ ఫ్లైట్ టికెట్లు, రూ.7.5 ల‌క్ష‌ల న‌గ‌దు ఇస్తున్న‌ట్టు తెలిపారు.  

Read: ఈ చేప‌ల‌తో జాల‌ర్ల‌కు భారీ లాభాలు…