Site icon NTV Telugu

ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ

ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల

ఈ సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై ఇటీవల సీఎం జగన్ సమీక్షించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ముందే చర్చ లేవనెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. మరోవైపు తెలంగాణతో నీటి పంపకం సమస్యలను కూడా సీఎం జగన్ సమావేశంలో లేవనెత్తనున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తెలంగాణ సర్కారు సైతం విభజన హామీలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించనుంది.

Exit mobile version