Site icon NTV Telugu

పన్ను ఎగవేతపై మొదటిసారి సోనూసూద్ స్పందన

Sonusood

గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూడు రోజుల దాడుల తరువాత ఐటి శాఖ సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, అతని ఫౌండేషన్‌కు సంబంధించి 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు కోసం ఖర్చు చేశారని ప్రకటించారు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ను, అభిమానులను షాక్ కు గురి చేసింది. మరోవైపు సోనూసూద్ గత నాలుగు రోజుల నుంచి సైలెంట్ గా ఉండడం ఆయన అభిమానుల్లో ఆందోళనను పెంచింది.

Read Also : మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాగార్జున స్పెషల్ వీడియో

తాజాగా సోనూసూద్ తన కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల తరువాత మొదటిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ మీ వైపు జరిగిన కథ చెప్పాల్సిన అవసరం లేదు. సమయమే చెప్తుంది. నేను నా శక్తిమేర ప్రజలకు సేవ చేస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి విలువైన జీవితాన్ని కాపాడటానికి, పేదలకు చేరుకోవడానికి తన వంతు కోసం ఎదురు చూస్తోంది. కొన్ని సందర్భాలలో మానవతాపరమైన కారణాల కోసం నా ఎండార్స్‌మెంట్ ఫీజును విరాళంగా ఇవ్వమని కూడా నేను బ్రాండ్‌లను ప్రోత్సహించాను. నేను కొద్దిమంది అతిథుల దగ్గర బిజీగా ఉన్నాను. కాబట్టి గత 4 రోజులుగా మీ సేవలో ఉండలేకపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మీ వినయపూర్వకమైన సేవలో నా ప్రయాణం కొనసాగుతుంది” అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు సోనూసూద్. కానీ సోనూ సూద్ ఎక్కడా ఆదాయపు పన్ను దాడులు, రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేత గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

Exit mobile version