NTV Telugu Site icon

ఓటుతో పాటు బీరుకోసం ఓ లెట‌ర్‌… వైర‌ల్‌…

నిన్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రిగింది.  సాధార‌ణంగా బ్యాలెట్ పేప‌ర్ల ద్వారా జ‌రిగే ఎన్నిక‌ల్లో కొన్ని విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూ ఉంటాయి.  కొంత‌మంది ఓట‌ర్లు త‌మ డిమాండ్లను ఓ స్లిప్ పై రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తుంటాయి.  ఇలాంటి విచిత్ర‌మైన సంఘ‌ట‌న ఒక‌టి అనంత‌పురం జిల్లాలోని న‌ల్ల‌చెరువులో జ‌రిగింది.  న‌ల్ల‌చెరువు మండ‌లంలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఓట్ల‌ను లెక్కిస్తుండ‌గా అధికారుల‌కు బ్యాలెట్ బాక్సులో ఓ స్లిప్ దొరికింది.  న‌ల్ల‌చెరువు మద్యం దుకాణాల్లో చ‌ల్ల‌ని బీరును ఉంచాల‌ని, అదే విధంగా మంచి బ్రాండు బీరును అందుబాటులో ఉంచాల‌ని చెప్పి రాసుంది.  న‌ల్ల‌చెరువు మందుబాబుల సంఘం పేరుతో ఈ లెట‌ర్ ఉండ‌టంతో అధికారులు షాక్ అయ్యారు.  వెంట‌నే ఆ లెట‌ర్‌ను వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.  

Read: కాబూల్‌లో రోడ్డెక్కిన మ‌హిళా ఉద్యోగులు…