కాబూల్‌లో రోడ్డెక్కిన మ‌హిళా ఉద్యోగులు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.  కాబూల్ మేయ‌ర్‌గా హమ్దుల్లా న‌మోనీ నియ‌మితుల‌య్యారు. కాగా, న‌మోనీ మ‌హిళా ఉద్యోగుల విషయంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  డిజైన్‌, ఇంజ‌నీరింగ్‌, టాయిలెట్స్ క్లీనింగ్ విభాగాల్లో ప‌నిచేసే మ‌హిళ‌లు మిన‌హా మిగతా మ‌హిళ‌లు ఎవ‌రూ కూడా ఉద్యోగాల‌కు హాజ‌రుకావొద్ద‌ని ఆదేశాలు జారీచేశారు.  మ‌హిళ‌లు ఇంటిప‌ట్టునే ఉండాల‌ని, బ‌య‌ట‌కు రావొద్ధ‌ని ఆదేశాలు జారీచేశారు.  కాబూల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో మొత్తం 3 వేల మంది ఉద్యోగులు ఉండ‌గా అందులో వెయ్యిమంది మ‌హిళా ఉద్యోగులు ఉన్నారు.  వీరిలో కేవ‌లం అతికొద్ది మందికి మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వ‌డంతో మిగ‌తా మ‌హిళ‌లు రోడ్డెక్కారు.  త‌మ హ‌క్కుల‌ను తాలిబ‌న్లు లాగేసుకుంటున్నారని మండిప‌డ్డారు.  మ‌హిళ‌లు లేకుండా ప్ర‌భుత్వాలు, ప్ర‌భుత్వ సంస్థ‌లు న‌డ‌వటం జ‌రగ‌వ‌ని, తాలిబన్లు అంద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పి ఇప్పుడు మ‌హిళ‌ల హ‌క్కులు కాల‌రాస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

Read: న‌గరంలో కొన‌సాగుతున్న ట్రాఫిక్ ఆంక్ష‌లు…

Related Articles

Latest Articles