Site icon NTV Telugu

వాహ‌న‌ప్రియుల‌కు శుభ‌వార్త‌: 2022 లో ఎల‌క్ట్రిక్ కార్ల హంగామ షురూ…

దేశంలో చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌టంతో వాహ‌నాల‌కు బ‌య‌ట‌కు తెచ్చేందుకు ఆలోచిస్తున్నారు.  లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 110 కి చేరింది.  అటు డీజిల్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి.  దీంతో వాహ‌నాదారుల చూపులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై ప‌డింది.  చ‌మురు వాహనాల‌కు ప‌క్క‌న పెట్టి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు.  టూవీల‌ర్స్‌తో పాటు అనేక కార్ల‌కంపెనీలు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను విడుద‌ల చేస్తున్నాయి.  2022లో అనేక కంపెనీలు కొత్త ఎల‌క్ట్రిక్ కార్ల‌ను విప‌ణిలోకి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.  

Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

2022లో 6 కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వివిధ కంపెనీలు రిలీజ్ చేయ‌బోతున్నాయి.  మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్, టెస్లా మోడల్ 3 & మోడల్ వై, వోల్వో XC40 రీఛార్జ్, ఆడి క్యూ4 ఈ-ట్రాన్, హ్యుందాయ్ అయోనిక్ 5, మినీ కూపర్ ఎస్ఈ కార్లు వ‌చ్చే ఏడాది విప‌ణిలోకి రాబోతున్నాయి.  ఈ కార్ల కంపెనీల ధ‌ర‌లు రూ. 25 ల‌క్ష‌ల నుంచి 76 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు.  

Exit mobile version