NTV Telugu Site icon

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Single use Plastic

Single use Plastic

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి… ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై ఈ నిషేధం విధిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది కేంద్రం. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ తయారీ, విక్రయం, వాడకంపై ఈ నిషేధం ఉంటుందని తెలిపింది.

ఇక, పాలిథిన్‌ సంచుల వాడకంపైనా కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది కేంద్రం. సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్‌ కవర్లకే అనుమతి ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ 31 నుంచి 120 మైక్రాన్ల కవర్లే వాడాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నివారణే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న కవర్లకే అనుమతి ఉంది. అయితే, ఏ ఫంక్షన్‌ అయినా.. పెళ్లి, దావత్ ఇలా ఏది అయినా.. ఎక్కడి చూసినా.. చివరకు ఇంటికి బంధువులు వచ్చినా.. ఇప్పుడు ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాస్‌ల వినియోగం పెరిగిపోయింది.. విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.