కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్‌లో జరిగింది. మలేషియాకు చెందిన భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తి మారక ద్రవ్యాల కేసులో సింగపూర్ ధర్మాసనం ఉరిశిక్షను విధించింది. సింగపూర్‌లో 42 గ్రాముల హెరాయిన్ ను కలిగిఉన్నారని ధర్మలింగం నాగేంద్రన్‌పై అభియోగాలు మోపబడ్డాయి. 2009 లో అతనిపై కేసు నమోదు చేశారు. 2010లో ధర్మాసనం ధర్మలింగానికి ఉరిశిక్ష విధించింది. కాగా, ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు అన్ని కోర్టుల చుట్టూ తిరిగాడు.
Read: మారని పరిస్థితులు… దిగజారుతున్న జీవనం…
క్షమాభిక్ష కోసం అధ్యక్షుడికి ధరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో 11 ఏళ్ల క్రితం మరణశిక్ష పడగా దానిని నవంబర్ 10 వ తేదీన ఛాంగీ జైల్లో అమలు చేయాల్సి ఉన్నది. అయితే, నాగేంద్రన్ మానసిక ఆరోగ్యం బాగాలేదని, ఉరిశిక్షను వాయిదా వేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఆ పిటీషన్‌ను కొట్టివేస్తూ కావాలంటే అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో హైకోర్టుకు ఆశ్రయించాడు ధర్మలింగం. మంగళవారం రోజున అత్యవసరంగా విచారణ చేపట్టిన సమయంలో జైలు అధికారులు ధర్మలింగానికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగిందని కోర్టుకు తెలిపారు.
దీంతో కోర్టు ధర్మలింగం ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. మానవతా దృక్పధంతో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. ధర్మలింగం ఉరిశిక్షను రద్ధు చేయాలని కోరుతూ వేలాది మంది కోర్టు భయట ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అటు మలేషియా ప్రభుత్వం కూడా ఉరిశిక్షను రద్దుచేయాలని కోరుతూ సంతకాలు చేసింది. దీంతో నాగేంద్రన్ ధర్మలింగం ఉరిశిక్ష అంశం అంతర్జాతీయ అంశంగా మారింది.
