దేశంలో కులమత వర్గ భేదాలకు అతీతంగా జరుపునే పండుగల్లో ఒకటి దీపావళి. దీపావళి అంటే దీపాల వరస అని అర్ధం ఉంది. దీపావళి రోజున దీపాలను వరసగా పేర్చి చీకట్లను పారద్రోలుతారు. అజ్ఞనమనే చీకటిని జ్ఞానమనే వెలుగుతో నింపేయడమే దీపావళికి అర్థం. దీపావళి రోజున ప్రతీ ఇంటి ముందు పిల్లలు పెద్దలు టపాలుసు కాలుస్తుంటారు.
Read: టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్
ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించినా ఆశ్వీయుజమాసం అమావాస్య రోజున దీపాలను వరసగా అమర్చుతారు. దీనికి కారణం లేకపోలేదు. లోకకంటకుడైన రాక్షసుడు నరకాసుడిని వధించబడిన రోజు కావడంతో ఈరోజును దీపావళిగా జరుపుకుంటారు. ఇక దీపావళిని దక్షిణ భారత దేశంలో నరకచతుర్థశి, దీపావళి అని రెండు రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటే, ఉత్తర భారత దేశంలో ధనత్రయోదశి, నరకచతుర్థశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ అని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించి యముడికి దీపం వెలిగిస్తారు. చతుర్ధశి రోజున దీపాలను వరసగా వెలిగిస్తారు.
