పంజాబ్ పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేసిన తరువాత పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్ధూ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మంత్రులు కోరినా ఆయన వినలేదు. రాజీనామాపై పునరాలోచన లేదని అన్నారు. తన తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాటం చేస్తానని సిద్ధూ పేర్కొన్నారు. అవినీతి మరకలు అంటిన వ్యక్తులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత విషయాల కోసం జరిగే యుద్ధం కాదని, సిద్ధాంతాల కోసం జరుగుతున్న యుద్ధం అని, అవినీతి మరకలు అంటిన మంత్రులను తీసుకోవడం తనకు నచ్చలేదని సిద్ధూ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Read: చైనాలో మరో సంక్షోభం… ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం…
