నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ డిసెంబర్ 24 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, సెబాస్టియన్ మడోన్నాలు హీరోయిన్లు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేశారు. శ్యామ్ సింగరాయ్‌గా నాని ఒదిగిపోయి నటించారు. రెండు పాత్రలు దేనికదే డిఫరెంట్ షేడ్స్ అని చెప్పాలి.
Read: మనోహరమైన ఈ టీ ఖరీదు లక్ష మాత్రమే…
ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌తో 1970 కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కిజే మేయర్ స్వరాలు అందించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు వరంగల్‌లో నిర్వహిస్తున్నారు.
Read: లైవ్: శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
