NTV Telugu Site icon

బాలయ్యను తట్టుకోలేక.. థియేటర్‌ సౌండ్‌ సిస్టంలో షార్ట్ సర్క్యూట్..

నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా చూస్తుండగా ఓ థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే జిల్లాలోని రవిశంకర్‌ సినిమా థియేటర్‌లో యథావిధిగా సాయంత్రం అఖండ ఫస్ట్‌ షో ప్రారంభమైంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి తరువాత తెరవెనుక ఉన్న సౌండ్‌ సిస్టంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.

దీంతో ఒక్కసారి ఖంగుతిన్న ప్రేక్షకులు థియేటర్‌ బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్‌ యాజమాన్యం, సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ‘బాలయ్య దెబ్బకు సౌండ్‌ సిస్టం తట్టుకోలేకపోయింది’ అంటూ కొందరు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.