అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితం కావడంతో జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తారని అనుకున్నారు. కరోనా మహమ్మారి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపించాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. పోయిన ఉద్యోగాలపై దృష్టి సారించారు. దీంతో 2020లో జననాల రేటు తగ్గింది. 2019 లో అమెరికా మొత్తం మీద 37.5 లక్షల మంది పిల్లలు పుట్టగా, 2020లో ఆ సంఖ్య 36 కు తగ్గిపోయింది. గతంతో పోలిస్తే 4శాతం తగ్గిపోయింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను ఇబ్బందులు ఎదుర్కొన్న 2008 వ సంవత్సరంలో కూడా జననాల రేటు 2.1 శాతం ఉండగా, 2020 లో ఈ జననాల రేటు 1.6 శాతం కు పడిపోయింది.
అమెరికాలో దారుణం: లాక్ డౌన్ కాలంలో భారీగా తగ్గిన జననాల రేటు…
