NTV Telugu Site icon

సీనియర్ గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూత

Jangu PRahlad

జనన నాట్య మండలి సీనియర్ కళాకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతో పాటు తెలంగాణా ఉద్యమంలో తన‌ ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించారు ప్లహ్లాద్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయన హైదరాబాదులోని జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ఆ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. ఆస్పత్రిలో ఈ రాత్రి ప్రహ్లాద్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Read Also : పిక్ వైరల్ : ఆర్యన్ కు బెయిల్… లీగల్ టీంకు షారుఖ్ పార్టీ