ఏ పుట్టలో ఏ పామున్నదో చెప్పడం కష్టం. అలానే ఎవరి వద్ద ఎలాంటి టాలెంట్ ఉన్నదో కనిపెట్టడం కూడా అంతే కష్టం. టాలెంట్ ఉన్న వ్యక్తులను ప్రపంచం ఎప్పుడోకప్పుడు తప్పకుండా గుర్తిస్తుంది. తెలియకుండానే అలాంటి వ్యక్తులు ట్రెండ్ అవుతుంటారు. సాధారణంగా బైక్ మీద ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని చోట్ల బైక్ రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ముందు బైక్ ఉంటుంది. వెనుక దానికి నలుగురైదుగురు కూర్చోని ప్రయాణం చేసేందుకు వీలుగా గూడు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో బైక్‌వెనుక లోడ్ తీసుకెళ్లేందుకు అనువుగా ఏర్పాటు చేయబడి కూడా ఉంటుంది. చిన్న చిన్న వస్తువులను, చిన్న చిన్న లోడ్‌లను ఆ బైక్‌పై తీసుకెళ్లవచ్చు.
Read: వైరల్: పెట్రోల్ లేకుండానే పరుగులు తీస్తున్న బైక్…
కానీ, ఒక లారీలో తీసుకెళ్లేంత లోడ్‌ను బైక్‌కు కట్టి తీసుకెళ్లాలి అంటే కుదరని పని. మనిషి తలచుకుంటే సాధ్యం కానిదంటూ లేదు. ఓ వ్యక్తి బైక్‌కు ట్రక్‌ను అమర్చి దానిపై లారీకి సరిపడినంత సరుకును వేసుకొని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. వెనుకనుంచి చూస్తే లారీ అనుకుంటారు. అదే ముందుకు వెళ్లి చూస్తే షాక్ అవుతారు. చిన్న మోపెడ్ ట్రక్‌ను లాక్కుంటూ వెళ్తుంది. ఇది నిజంగా ఆశ్చర్యపోయే విషయమని చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చిన ట్రక్, ట్రక్‌తో పాటు బైక్ రెండు కిందపడిపోతాయి. ఆ వ్యక్తి డ్రైవింగ్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.