Site icon NTV Telugu

గుడ్‌న్యూస్‌: క‌రోనా వేరియంట్ల క‌ట్ట‌డికి లామా ఔష‌ధం…

క‌రోనా కేసులు ప్ర‌పంచాన్ని మ‌ళ్లీ భ‌య‌పెడుతున్నాయి.  ఆఫ్రికా, యూర‌ప్ దేశాల్లో కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. యూరప్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇక‌ ఆసియా దేశాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ ద‌డ పుట్టిస్తోంది. కేసులు పెరుగుతుండ‌టంతో వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేశారు.  అయితే, క‌రోనాలోని అన్ని వేరియంట్‌ల‌కు చెక్ పెటేందుకు అవ‌స‌ర‌మైన ఔష‌ధం కోసం శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఒంటెజాతికి చెందిన లామా అనే జీవిలో అతిసూక్ష్మ‌మైన యాండీబాడీలు ఉన్నాయ‌ని, ఇవి క‌రోనా వేరియంట్ల నుంచి స‌మ‌ర్థ‌వంతంగా ర‌క్ష‌ణ క‌ల్పించ‌గ‌ల‌వ‌ని రాక్ ఫెల్ల‌ర్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు కనుగొన్నారు.  

Read: ఒమిక్రాన్ టెన్ష‌న్‌: మ‌ళ్లీ రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తారా?

కొత్త వేరియంట్ కేసులు విజృంభిస్తున్న వేళ శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యాన్ని కొనుగొన‌డం గొప్ప విశేషం. క‌రోనా వైర‌స్ టీకాల‌ను లామా ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వాటి శ‌రీరంలో అతి సూక్ష్మ‌మైన యాంటీబాడీలు డెవ‌ల‌ప్ అయ్యాయ‌ని, అవి వూహాన్‌, డెల్టా వంటి వేరియంట్ల‌లోని స్పైక్‌ల‌ను అదుపులోకి టెచ్చాయ‌ని, ఒమిక్రాన్ స్పైక్స్‌ను ఎంత వ‌ర‌కు ఈ యాంటీ బాడీలు అదుపుచేస్తాయి అనే దానిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని యూనివ‌ర్శిటి శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  

Exit mobile version